గడ్డం-ఉపయోగాలు, ప్రయోజనాలు, లాభాలు
తరచుగా గడ్డం చేయాల్సిన పనిలేదు!
క్షౌరశాలకు నిత్యం వెళ్ళక్కర్లేదు! సబ్బు ఖర్చు తక్కువ! మామూలు నీళ్లతో కడుక్కున్నా మొహం తాజాగా ఉంటుంది! గడ్డాల ట్రిమ్మింగ్ చేసి చేసి- క్షౌరశాల నిపుణుల “నైపుణ్యం” పెరుగుతుంది - ఆ “పుణ్యం” గడ్డంమొహం వాళ్లదే!
గడ్డం మొహాన్ని ఆట్టే జనం గుర్తు పెట్టుకుంటారు! ఇంకోమారు ఏ షాపుకి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తారు! ఎంత గుంపులో ఉన్నా “చుక్కల్లో చంద్రుడిలా” టక్కున గుర్తుపడతారు! కొత్తవాళ్లు కూడా రెండోసారి చూసినప్పుడే గుర్తుపట్టేస్తారు!
అవతలవాళ్ళకు కూడా సులువు ఇతరులకు చెప్పడానికి, ఆనవాలు పట్టడానికి - "ఆ గడ్డం మనిషి" అని! గడ్డంవల్ల గ్రామర్ తో సంబంధం లేకుండా గ్లామర్ వచ్చేస్తుంది! వర్ణబేధం లేకుండా ఏరంగు మొహమైనా గడ్డం పెంచుకోవచ్చు! గడ్డంవల్ల మొహం కొద్దిగా నిండుగా కనపడుతుంది!
గడ్డం చేసుకుంటేగానీ బయటకు వెళ్ళకూడదు అనే నియమమే ఉండదు! గడ్డం మొహానికి ఓ కళ్ళజోడు తగిలిస్తే ఆ స్టయిలే వేరు! ఎంతమందిలో అయినా ప్రత్యేకంగా కనిపిస్తారు! మన ఇంటిపేరు గడ్డం అయిపోతుంది కొంతమందికి!
తరచుగా గడ్డం చేయాల్సిన పనిలేదు! క్షౌరశాలకు నిత్యం వెళ్ళక్కర్లేదు! సబ్బు ఖర్చు తక్కువ!
మామూలు నీళ్లతో కడుక్కున్నా మొహం తాజాగా ఉంటుంది! గడ్డాల ట్రిమ్మింగ్ చేసి చేసి- క్షౌరశాల నిపుణుల “నైపుణ్యం” పెరుగుతుంది - ఆ “పుణ్యం” గడ్డంమొహం వాళ్లదే! గడ్డం మొహాన్ని ఆట్టే జనం గుర్తు పెట్టుకుంటారు! ఇంకోమారు ఏ షాపుకి వెళ్లినా గుర్తుపట్టి పలకరిస్తారు! ఎంత గుంపులో ఉన్నా “చుక్కల్లో చంద్రుడిలా” టక్కున గుర్తుపడతారు!
కొత్తవాళ్లు కూడా రెండోసారి చూసినప్పుడే గుర్తుపట్టేస్తారు! అవతలవాళ్ళకు కూడా సులువు ఇతరులకు చెప్పడానికి, ఆనవాలు పట్టడానికి - "ఆ గడ్డం మనిషి" అని! గడ్డంవల్ల గ్రామర్ తో సంబంధం లేకుండా గ్లామర్ వచ్చేస్తుంది! వర్ణబేధం లేకుండా ఏరంగు మొహమైనా గడ్డం పెంచుకోవచ్చు! గడ్డంవల్ల మొహం కొద్దిగా నిండుగా కనపడుతుంది!
గడ్డం చేసుకుంటేగానీ బయటకు వెళ్ళకూడదు అనే నియమమే ఉండదు! గడ్డం మొహానికి ఓ కళ్ళజోడు తగిలిస్తే ఆ స్టయిలే వేరు! ఎంతమందిలో అయినా ప్రత్యేకంగా కనిపిస్తారు! మన ఇంటిపేరు గడ్డం అయిపోతుంది కొంతమందికి!
ఇంకో గడ్డంవాడు చూసాడంటే (అందరు కాదనుకోండి) పలకరింపుగా నవ్వేస్తాడు,స్వజాతివాణ్ని చూసినట్టుగా -వాడు సీరియస్ గా ఉండే మనిషి అయినా సరే!
గడ్డంవల్ల మొహం రంగు మారదు-ఫెయిర్ అండ్ లవ్లీ వాడకుండానే!
నల్లమొహం తెల్లబడదుగానీ-రంగు నిలబడిపోతుంది- మొహం కారునలుపు అవకుండా! మొక్కల ఆకుల కత్తిరించే నైపుణ్యం ఉంటే- గడ్డం ఇంట్లోనే ట్రిమ్మింగ్ చేసుకోవడం సులువు-మొక్కల కత్తెరతో మాత్రం కాదు!
గడ్డంవల్ల మోహంలో కడుక్కునే ప్రదేశం తగ్గిపోతుంది! అశ్రధ్ధతో ట్రిమ్మింగ్ చేయడం ఆలస్యం అయినా గడ్డంమొహం బానేఉంటుంది- రోజువారీ గడ్డంచేసేవాడు మాత్రం ఓ రెండురోజులు గడ్డం గీయకపోతే జబ్బుపడ్డవాడిలా ఉంటాడు! ఏదైతేనేం- పైన చెప్పిన లాభాలతో పాటు ఇంకో విషయం ఏమిటంటే- గడ్డంవున్న మొహంవాడు ఓ మేధావిలా కనపడతాడు పరులకు-ఇదో పేద్ద ప్రయోజనం కదూ!
అర్ధం అయ్యింది కదా-గడ్డంవల్ల లాభాలు- ఆలస్యం అయినా పర్వాలేదు- మొదలు పెట్టండి గడ్డం పెంచడం! సందేహించకండి,మొహమాటపడకండి-ఎవరో ఏదో అనుకుంటారని- మన మొహం, మన గడ్డం, మన ఇష్టం! ఇంకో పెద్ద విషయం ఏమిటంటే- గడ్డం పెంచటానికి పెట్టుబడి ఉచితం - ఆర్యభట్టగారు కనిపెట్టిన “జీరో”-సున్నా! ఇవి కాకుండా వేరే ఇంకైనా లాభాలు ఉంటే తెలియచేయండి- తెలుసుకొని సంతోష పడతాను! మరోమాట-కరోనా ధర్మమా అని గడ్డపు వాళ్ళ సంఖ్యా బాగా పెరిగిపోయిందని (నా లాంటివాళ్లు అన్నమాట)క్షౌరశాలల వాళ్ళు గగ్గోలు పెడుతున్నట్టుగా ఆ మధ్య పేపర్ లో వార్త చదివాను.ఏడాది తర్వాత మొన్నామధ్య నేనో క్షౌరశాలకి వెళ్ళినప్పుడు దాని యజమాని నాతో కూడా వాపోయాడు!
నా స్నేహితుల్లో ఒకనికి కొచ్చిన్ లో ఓ యూనిసెక్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ వుంది-అతను అదే వాపోయాడు-వ్యాపారం బాగా దెబ్బతింది అని. ఇప్పుడు దేశమంతటా పరిస్థితులు దాదాపుగా యధాస్థితికి వచ్చాయి;అన్నిరకాల వ్యాపారాలు పూర్వపు స్థాయికి తొందరగా రావాలని అందరూ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.
ఇంకోమాట-ఈ ఆన్ లైన్ కొనుగోళ్లు కాస్త పక్కనపెట్టి- బయటకివెళ్ళి- ప్రత్యక్షంగా అన్నీ కొనటానికి ప్రయత్నం చెయ్యండి-అప్పుడేగా అందరి వ్యాపారాలు త్వరగా కోలుకునేది.మనిషి రోడ్డున పడ్డాడు-ఇంట్లోంచి-అన్నీ అంతటా పనిచేస్తున్నాయి; అయినాకూడా మన జాగ్రత్తల్లో మనం ఉందాం!